Thursday, May 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం యువతకు ఉద్యోగ మహోత్సవం… హరీష్ బాబు

ధర్మవరం యువతకు ఉద్యోగ మహోత్సవం… హరీష్ బాబు

విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సత్య సాయి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ధర్మవరంలోని స్థానిక సాయి రామ్ ఐటిఐ కళాశాల ఆవరణంలో జాబ్ మేళా నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాకి 11 కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళా కు సుమారు 110 మంది యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 67 మంది వివిధ కంపనీలకు ఎంపిక కావడం జరిగింది . ఈ యొక్క జాబ్ మేళ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గం ఇంచార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ 2024 సంవత్సరం ఏప్రిల్ 4న ఎన్నికల ప్రచారానికి ధర్మవరంలో అడుగుపెట్టిన సత్య కుమార్ యాదవ్ , గ్రామాల వారీగా ఇంటి ఇంటికి తిరుగుతూ యువతతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు అని తెలిపారు. ఆ సందర్భంగా, అనేక మంది యువతీయువకులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారని, తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది అన్నారు. ఆ మాటలు గుండెల్లో వేసుకున్న శత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగింది అన్నారు. ఆయన ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక ఉద్యోగ మేళాలను నిర్వహించారు అని తెలిపారు. సంస్కృతి సేవాసమితి ఆధ్వర్యంలో సిఎన్బి గార్డెన్స్ వేదికగా జరిగిన ఉద్యోగ మేళాల్లో దాదాపు 1700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి అని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా, మళ్ళీ రెండో దశలో రెండు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పలు కంపెనీలు ముందుకొచ్చాయి అని తెలిపారు. ఇందులో కొన్ని కంపెనీలు యువతకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల దాకా వార్షిక జీతాలు అందించే అవకాశం కూడా కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ప్లేస్ మెంట్ అధికారి తేజ్ కుమార్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సీడాప్ సిబ్బంది ఎంప్లాయిమెంట్ అధికారి, ఐటిఐ కన్వీనర్/ప్రిన్సిపల్ రాయప రెడ్డి , బిజెపిపట్టణ అధ్యక్షులు జింక చంద్ర శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబ్లేస్, అప్రెంటిషిప్ అడ్వైజర్స్ ఓబులేసు, ఐటిఐ కళాశాల కరస్పాండెంట్ హరినాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి , కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు