మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ పరిశుభ్రతకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే పట్టణములోని శానిటేషన్ పరులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండవ డివిజన్లోని మాస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది అధికారులు పాలన పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని వారు ఆరా తీశారు. అనంతరం మాస్టర్లో సమావేశాన్ని నిర్వహిస్తూ పట్టణములో ఎక్కడ కూడా అపరిశుభ్రత ఉండరాదని, పరిశుభ్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ముఖ్యంగా సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పట్టణ పరిశుభ్రతలో అప్రమత్తంగా ఉంటూ, సహకరించాలని తెలిపారు. పట్టణంలోని కొత్తపేట, మెయిన్ బజార్, తేరు బజార్ లలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్న తీరును వారు పరిశీలిస్తూ, కాలువల శుభ్రంగా ఉన్నాయా లేదా అన్న వాటిని పరిశీలించారు. తదుపరి అన్నా క్యాంటీన్ ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్లో భోజనము టిఫిన్ నాణ్యత గూర్చి అక్కడ వచ్చిన వారితో వారు ఆరాధించారు. అనంతరం అన్నా క్యాంటీన్ సిబ్బందితో నాణ్యత కలిగిన ఆహారాన్ని ప్రజలకు అందించాలని,ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శామ్సన్, కేశవ, మేస్త్రీలు, శానిటరీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పట్టణ పరిశుభ్రతకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి..
RELATED ARTICLES