Thursday, May 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయాలు తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.. అంజలి సౌభాగ్యవతి

గ్రంథాలయాలు తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.. అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర- ధర్మవరం ; గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, గ్రంథాలయాల తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమాలు లో భాగంగా మూడవ రోజు విద్యార్థులకు కథలు చెప్పడం చదివించడం ఇంగ్లీష్ గురించి అవగాహన కార్యక్రమాలను, దీంతోపాటు నాట్యం పై అవగాహన తదితర వివరాలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెన్నెల వివరించడం జరిగింది.. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలోవిద్యార్థులకు కావలసిన అన్ని అంశాలపై ఈ శిక్షణా శిబిరాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఏ విధంగా చదవాలి అనే అంశాన్ని కూడా వారు వివరించారు అని తెలిపారు. 40 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు