పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ……..
విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే డే’ను పామిడి కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, సీపీఎం నాయకులు, కార్మికులు జెండాలను ఆవిష్కరించి, వేడుకలు జరుపుకొన్నారు. పామిడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 45 మంది పారిశుద్ధ్య కార్మికులకు గురువారం ఎంపీడీవో తేజోత్స్న, ఈవో గోపాల్ చేతుల మీదుగా బట్టలు జనసేనా సీనియర్ నాయకులు పూల రమణ, జీవన్, పవన్, ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఆటో యూనియన్ నాయకులు సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యుడు రహీం మాట్లాడుతూ 1886 సంవత్సరంలో మొదటిసారిగా చికాగోలో కార్మికులు రోజుకు 8 గంటలు పనికి, 8గంటలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు మిగిలిన 8 గంటలు విశ్రాంతి కి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీన ప్రదర్శనలు జరిపారు అని 1923 సంవత్సరంలో చికాగో మే డే ను సంస్మరిస్తూ భారతదేశంలో మే ఒకటో తేదీన మొదటి సారిగా సింగర్ వేలు చెట్టియూర్ మే డే ను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకుల సూర్య నారాయణ రెడ్డి, నాగరాజు, ఇమామ్, ఈశ్వరయ్య, ఆటో యూనియన్ నాయకులు సిద్ధ, జాఫర్, నడిపి పీర, కుమార్, జనసేనా నాయకులు మునగాల అనిల్, సుబ్బు, వడ్డే రాము, లాలూ, సాయి సూర్య, జమీరు, తదితరులు పాల్గొన్నారు.