Thursday, May 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్మిక హక్కులను సాధించుకుందాం…

కార్మిక హక్కులను సాధించుకుందాం…

లేబర్ కోడ్ విధానాన్ని రూపుమాపేవరకు పోరాడుదాం… సిపిఐ కన్వీనర్ రెడ్డప్ప
మండల కేంద్రంలో ఘనంగా మేడే సంబరాలు

విశాలాంధ్ర -తనకల్లు :మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సిపిఐ కన్వీనర్ రెడ్డప్ప ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.కార్మికుల పండుగ రోజు సందర్భంగా ఏఐటీసీ జెండాను ఎగరవేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కన్వీనర్ రెడ్డప్ప మాట్లాడుతూ కార్మికుల శ్రమదోపిడిని గుర్తించి 16 గంటల నుండి 18 గంటలు పని చేయిస్తున్న యజమానుల ఆగడాలను కట్టించేందుకు అమెరికాలోని చికాగో నగరంలో ‘హే ‘మార్కెట్లో 8 గంటల పని సమయాన్ని తగ్గించాలంటూ 1886 మే 1వ తేదీన మొదలైన ఉద్యమమే విప్లవమే కార్మిక దినోత్సవంగా రూపుదిద్దుకుంది ఆరోజు జరిగిన సంఘటనలో కార్మికుడి ఎర్రచొక్కా రక్తంతో తడవడంతో ఆ ఎర్ర చొక్కా ఎగురవేయడమే ఎర్ర జెండాగా మనం ఎగురవేస్తున్నామనేది నిజం అన్నారు. తరువాత ప్రపంచవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు ఏర్పడి కార్మిక హక్కుల కోసం పోరాడి మే ఒకటో తేదీని కార్మిక దినంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను హరించి వాటిని కుదించి వర్గాలుగా విడగొట్టి పబ్బం కడుక్కోవాలని చూస్తున్నాయని కార్మికుల హక్కుల సాధన కోసం ఎర్రజెండా నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు ముఖ్యంగా లేబర్ కోడ్ విధానాన్ని ఎత్తేసే వరకు అలుపెరగని పోరాటాలు సాగిస్తామన్నారు. రైతు కూలీలకు కార్మికులకు కర్షకులకు అసంఘటిత కార్మికులకు అందరికీ ఎర్రజెండా అండగా నిలుస్తుందని మేడే సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు భూస్వాములకు కొమ్ముకాకుండా కార్మికుల హక్కులను విస్మరించే విధంగా విధానాలు తీసుకొస్తే తగిన మూల్యం తప్పదన్నారు. మే డే వర్థిల్లాలి అనే నిదానలతో కూడలి మొత్తం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్ప సిపిఐ నాయకులు ఆనందు రవి రవీంద్రనాయక్ రెడ్డప్ప ఏఐటియుసి నాయకులు చలపతి నరసింహులు నాయక్ మూర్తి మహిళా నాయకురాలు సుగుణమ్మ గౌరమ్మ అనసూయమ్మ భవనిర్మాణ కార్మికులు వెంకటేశు శ్రీనివాసులు డి శ్రీనివాసులు వెంకటరమణ తో పాటు మండలంలోని కార్మికులు కర్షకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు