విశాలాంధ్ర – శెట్టూరు (అనంతపురం జిల్లా) : మేడే కార్మికుల త్యాగాలను, పోరాట చరిత్రను గుర్తుచేసే మహత్తర దినోత్సవం అని అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇది శ్రమికుల శబ్దానికి ఒక ప్రపంచవ్యాప్త ప్రతిధ్వని. 1886 మే 1న అమెరికాలో జరిగిన హయ్‌మార్కెట్ పోరాటం ప్రపంచ కార్మిక ఉద్యమానికి చరిత్రాత్మక మలుపు తీసుకొచ్చింది. శ్రమికులు 8 గంటల పని దినం కోసం తమ జీవితాలను పణంగా పెట్టారు. ఈ పోరాటమే నేటి ప్రపంచ కార్మికులకు స్పూర్తిగా నిలుస్తోంది. ఈ తరహా త్యాగాల ఫలితంగా మనకు ఇవాళ చిన్నపాటి హక్కులు అందుబాటులో ఉన్నాయి. కానీ నేటి పరిస్థితుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో — అవినీతి, పుట్టిన పేదరికం, కాంట్రాక్టు విధానం, కార్మిక హక్కుల అవమానం, కార్పొరేటీకరణ వలన ఉపాధి లోపం, నిరుద్యోగం, న్యాయమైన వేతనాలపై అనిశ్చితి.
ఇలాంటి సందర్భంలో మేడే మనందరికీ ఒక జ్ఞాపకం – శ్రమకు గౌరవం ఇవ్వాలనే, కార్మికులను కేవలం శక్తిగా కాకుండా ఒక మేధస్వరూపంగా గుర్తించాలనే భావనతో మన హక్కుల కోసం నిరంతరం పోరాడాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు అపర్ణ, సరస్వతి, ద్రాక్షాయని , పార్వతి, విశాలాక్షి, వన్నూరమ్మ అంగన్వాడి హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు