చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణ అభివృద్ధికి ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళతామని, అన్ని సమస్యలు పరిష్కరించే దిశలో తాము కృషి చేస్తామని చైర్పర్సన్ కాచర్ల లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కౌన్సిల్లో పట్టణంలోని నీటి కొరత, వీధి దీపాలు, రోడ్లు తదితర విషయాలను కౌన్సిలర్లు చైర్మన్కు వివరించారు. అదేవిధంగా పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు 117 కోట్లతో ముందుకు వెళుతున్నట్లు వారు తెలిపారు. తొలుత పహల్గామాలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వొడ్డిన వారికి రెండు నిమిషాలు మౌనం వహించి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ అధికారులు అజెండాను చదివి వినిపించారు. కొంతమంది కౌన్సిలర్లు మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశము సమాచారాన్ని ముందు రోజు ఇచ్చి అజెండా కాగితాలను చేతికి ఇస్తున్నారని దీనివల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నామని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తదుపరి కమిషనర్ పట్టణ సమస్యలకు వివరణ ఇవ్వడంతో పాటు శివారు కాలనీలో మూడు కోట్లతో సీసీ రోడ్లు కాలువలు నిర్మించబోతున్నామని తెలిపారు. ఒకే వార్డుకు కాకుండా అన్ని వార్డులకు నిధులను విడుదల చేయాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తదుపరి కోటి రూపాయలకు సంబంధించిన టేబుల్ అజెండా పత్రాలను కౌన్సిలర్లకు ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం ముగిశాక కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు రాసుకోవడం సరికాదని, మున్సిపల్ చైర్ పర్సన్ కాచెర్ల లక్ష్మీతో పాటు కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి ,మాసపల్లి సాయికుమార్, గోరకాటి పురుషోత్తం రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తదుపరి కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మల్లేనిపల్లి వద్ద హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి 80 లక్షల కేటాయించారని స్మశానికే వెళ్లేందుకు రోడ్డు నిర్మించాలని తెలిపారు. అదేవిధంగా ఎల్సికేపురం జగనన్న కాలనీ కేతిరెడ్డి కాలనీ ప్రజలు ఎవరైనా చనిపోతే మల్లేనిపల్లి స్మశాన వాటికకు తీసుకొని రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్సీకే పురములో ఏదైనా రిజర్వుడు స్థలాలను కేటాయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ శంషాద్ బేగం, జయరాం రెడ్డి, కౌన్సిలర్లు, పురపాలక విభాగంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ అభివృద్ధికి ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళతాం
RELATED ARTICLES