Saturday, May 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తాదులు తరలిరండి

శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తాదులు తరలిరండి

నియోజకవర్గ,ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వారి బ్రహ్మోత్సవాలకు (ఈనెల 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు) భక్తాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని ధర్మవరం నియోజకవర్గ, ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం బ్రహ్మోత్సవాలు ముందు రోజు మూలవిరాట్ విగ్రహాలకు ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తరఫున పట్టు వస్త్రాలను వారు ఆలయ అర్చకులకు అందజేశారు. అదేవిధంగా బిజెపి నాయకులు జింకా రామాంజనేయులు కూడా ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తొలుత హరీష్ బాబు, జింకా రామాంజనేయులు లకు ఆలయ అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్, అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాసు వేదమంత్రాలు, మేళ తాళాలతో, కేరళ పంచమ వాయిద్యాలతో అన్నమయ్య సేవామండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం వారికి స్వాగతం పలికారు. తదుపరి వీరి పేరిటన ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. తదుపరి బ్రహ్మోత్సవాలకి ఆలయ అలంకరణ పనులను వారు పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు గురించి అర్చకులు, చైర్మన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. భక్తులకు, దాతలకు, పుర ప్రముఖులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని తెలిపారు. తదుపరి ఆలయ కమిటీ అడ హక్కు కమిటీ చైర్మన్ హరీష్ బాబును, జింక రామాంజనేయులు ఘనంగా సత్కరించారు. తదుపరి హరీష్ బాబు మాట్లాడుతూ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ తన సొంత ఖర్చులతో (15 లక్షలకు పైగా) ఆలయ రూపురేఖలను మార్చడం జరిగిందని, రంగులతో, పెయింటింగులతో, సాంప్రదాయ పద్ధతిలో భక్తి వాతావరణంలో ఉండే విధంగా నేడు ఆలయం ఆహ్లాదకరమైన భక్తి మార్గంలో ఉండడం పట్ల వారు అభినందించారు. సనాతన ధర్మముతో తాను ముందుకు వెళ్లడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. నేడు ఆలయం చక్కటి రంగులతో కూడిన అలంకరణ ఉండడం అభినందనీయమని తెలిపారు. 10వ తేదీన నిర్వహించబడే బ్రహ్మరథోత్సవం (తేరు పండుగ) కార్యక్రమానికి వేలాది సంఖ్యలో భక్తాదులు తరలిరావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు, భక్తాదులు, అన్నమయ్య సేవా మండలి శిష్య బృందం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు