విశాలాంధ్ర- ధర్మవరం; దేశ వ్యాప్తంగా బీసీల కుల గణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో బీసీల విజయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల శంకరయ్య తెలిపారు. పట్టణంలోని కాలేజి సర్కిల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోది, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నామాల శంకరయ్య మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఈరోజు ఆయన పోరాడిన ఫలితమే కేంద్రంలో బీసీల కుల గణన చేసేందకు మోది ప్రభుత్వం ఆమోదించడం హర్షనీయమన్నారు. కొన్ని సంవత్సరాలుగా బీసీల నాయకులు పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం బీసీల కుల గణన చేయాలని నిర్ణయించి బీసీల ఉన్నతికి ఎంతో దోహదపడుతుందన్నారు. బీసీ కుల గణన చేపడితే ఏ కులాలు ఎంత శాతం ఉన్నారో తెలియడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా చాలా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డె తిరుపతయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మర వెంకటరమణ, పట్టణాధ్యక్షుడు బండి వెంకటేష్, డైరెక్టర్లు బీసీ మల్లన్న. రజక నరసింహులు, అన్నం లక్ష్మినారాయణ, నాయకులు పి.శంకరయ్య, పల్లపు వెంకట్రాముడు, బాలాజి, తేజ్, నిషార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల కుల గణన చేసేందుకు కేంద్రం అంగీకరించడం.. బీసీల విజయం
RELATED ARTICLES