విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితి ఆధ్వర్యంలో మే 4వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రాములింగయ్య, ఉప కార్యదర్శి జే సి. రాయుడు, కోశాధికారి సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ధర్మవరం, పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్లు పరీక్షలు పూర్తిగా ఉచితమన్నారు. అదేవిధంగా కంటి నిపుణుల సలహాలచే కంటికి ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఆపరేషన్ల కొరకు వెళ్లిన వారికి కడపలో ఉచిత భోజనం ,వసతి, ఇతర సౌకర్యమును కూడా కల్పించబడునని తెలిపారు. కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరములకు వచ్చువారు ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. కంటి వైద్య పరీక్షలు జరిగిన తర్వాత ఆపరేషన్కు ఎంపికైన వారిని ఇదే రోజు కడప ఆసుపత్రికి వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు. బిపి, షుగర్ ఉన్నవారు వాటిని నియంత్రించుకొని మెడిసిన్స్ తో రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని మంచి కంటి చూపును పొందగలరని తెలిపారు.
ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరం.. షిరిడి సాయిబాబా సేవా సమితి
RELATED ARTICLES