విశాలాంధ్ర ధర్మవరం ;;ధర్మవరం అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కదశలో ప్రభుత్వ మద్దతుతో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ కట్టుబడి ఉన్నారని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ నిధుల ద్వారా ధర్మవరం పట్టణంలో నూతనంగా ఐదు జిమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ జిమ్‌లు ప్రజల శారీరక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు తోడ్పడేలా ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు కానున్నాయి అని తెలిపారు. ఈ జిమ్‌లను జనసాంద్రత కలిగిన వంటి శివనగర్, ఎం.జీ కాలనీ, దుర్గా నగర్, రామ్ నగర్, పోలీస్ క్వాటర్స్ వంటి ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరిష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తో కలిసి ఆయా ప్రాంతాల్లో స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందన్నారు. స్థానిక ప్రజల నుంచి సుజనాభిప్రాయాలు సేకరించి, తగిన సౌకర్యాలు ఉన్న ప్రదేశాల ఎంపిక జరగనుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉచితంగా ఆరోగ్యభద్రతకు అవసరమైన వాయవ్య సాధనాల సదుపాయం , యువతతో పాటు అన్ని వయసులవారూ ఈ జిమ్ముల ద్వారా లాభం పొందగలుగుతారు అని తెలిపారు. ధర్మవరం అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కదశలో ప్రభుత్వ మద్దతుతో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, బిజెపి నాయకులు బిల్లే శ్రీనివాసులు, జూటూరు వెంకటేష్, కుంచుపు నారప్ప, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో నూతనంగా ఐదు జిమ్‌లు ఏర్పాటు
RELATED ARTICLES