రాష్ట్ర నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వైపు పోరాటానికి సిద్ధం కావాలి ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్ర నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వైపు పోరాటానికి సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఘనంగా ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అనంత్ నగరంలోని పలు శాఖలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అఖిలభారతి యువజన సమాఖ్య 66ావ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో సుఖ దేవ నగర్, రాజమ్మ కాలనీ ల లో మాజీ ఏఐవైఎఫ్ నాయకులు జాఫర్, శ్రీరాములు రమణ ఏవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ సంతోష్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ మాజీ నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ముందుగా యువజన నాయకత్వం తోశాంతి, ఐక్యత, సఖ్యత కోసం నిలబడాలి.
దేశ సమైక్యత, సమగ్రత,సార్వభౌమాదిక్కారాన్ని కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేయంచి నవయుగ శాఖ లో పతాక ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాఫర్,సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో ఃమేం అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది కోటి ఉద్యోగాలను కల్పిస్తాంః అని మోదీ ప్రకటించడం జరిగిందన్నారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోందన్నారు. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగిందినీ. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందన్నారు. దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చిన తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారన్నారు . నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు వలసలకు పోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో మంచినీళ్లు కొరత ఉందేమో గాని మందు కొరత లేదన్నారు. యువత గంజాయి డ్రగ్స్ వాడకంలో తమ జీవితాలు నాశనం వేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం ఉండారన్నారు. యువతను సన్మార్గంలో నడిచే విధంగా అఖిలభారత యువజన సమాఖ్య రాబోయే రోజుల్లో పని చేయాలని కోరారు. యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో ప్రతి రోజు 40 నుంచి 45మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపిచడంలో ప్రభుత్వాలు గోరంగా విఫలం అయింది అన్నారు. ఈ నెల లో 15-18 తేదీలలో 17వ జాతీయ మహాసభల తిరుపతిలో జరగనుందినీ నిరుద్యోగ యువత ఏ.ఐ.వై.ఎఫ్ నాయకత్వం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మహాసభలలో సమగ్ర యువజన విధానం, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ,నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని పలు డిమాండ్ చేయబోతున్నాం తెలిపారు.. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు దేవా, నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, శ్రీనివాస్ నగర ఉపాధ్యక్షులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు…