Monday, May 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై ఆరోపణలు చేయడం సమంజసం కాదు.. పట్టణ కౌన్సిలర్లు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై ఆరోపణలు చేయడం సమంజసం కాదు.. పట్టణ కౌన్సిలర్లు

బిజెపి నాయకులపై వైయస్సార్సీపి నాయకుల తీవ్ర ఆగ్రహం
విశాలాంధ్ర -ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచింది కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అని మున్సిపల్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్ గజ్జల శివ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ 11 నెలల కూటమి పాలనలో అవినీతి దందాలకు కేరాఫ్ గా మారడం జరిగిందని, ఇది అక్షరాల సత్యము అని వారు స్పష్టం చేశారు. 11 నెలల ఎన్డీఏ పాలనలో ప్రజలు విసుగు చెందడం జరిగిందని, ప్రజలు అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియా రాజ్యమేలుతున్నాయని లక్షలు గడుస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మాఫియాకు అడ్డుకట్టు వేయాల్సిన అధికారులే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వారు మండిపడ్డారు. రెవెన్యూ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో లంచాలు వసూలు చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై నిరాహార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, వారు అభివృద్ధి చేసిన వాటిని ఒక్కసారి పరిశీలిస్తే అంతా అర్థమవుతుందని వారు సలహా ఇచ్చారు. నిజంగా అభివృద్ధి ఎవరు చేశారో ధర్మవరం ప్రజలకు తెలుసునని వారు తెలిపారు. పట్టణానికి తాగునీటి పథకాన్ని తెచ్చి నీటి ఎద్దడిని నివారించిన నాయకుడు మా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అని తెలిపారు. కేతిరెడ్డి హయాంలో 24 వేల ఇంటి పట్టాలను మంజూరు చేసిన ఘనత వారికే దక్కిందన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. తాము అభివృద్ధి పనులకు ఎప్పుడు కూడా అడ్డు రామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎన్డీఏ నాయకులు గమనించాలని నిరాధారమైన మాటలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు పెనుజూరు నాగరాజు, రమాదేవి, చింతా పుల్లయ్య, అత్తర్ జిలాన్, వార్డు ఇన్చార్జులు భాష, కేశగాల కృష్ణ, కత్తి పెద్దన్న ,మట్టిద్దుల కేశవరెడ్డి, గడ్డం రంగా, బాలగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు