Monday, May 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంకార్మికులకు కనీస వేతనం 35 వేలుగా నిర్ణయించాలి

కార్మికులకు కనీస వేతనం 35 వేలుగా నిర్ణయించాలి


ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్

విశాలాంధ్ర- అనంతపురం : ఎపి లో కనీస వేతనాలు నిర్ణయించే బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు.
కార్మికుల వేతనాల సమస్యలపై ఏఐటీయూసీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం అనంతపురము సంఘమేష్ సర్కిల్ నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ… పోయిన నెలలో గోవాలో జరిగిన ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీలో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల పరిస్థితులు పై విశ్లేషణ చేసి కనీస వేతనం 35 వేలు ఉండాలని తీర్మానం చేశామన్నారు. అందులో భాగంగా మన దేశంలో ఓక కుటుంబం బతకాలంటే కనీసం 35 వేలు వేతనం ఉండాలన్నారు. ఎపి లో గత పది సంవత్సరాల నుండి వేతనాలు నిర్ణయించే బోర్డు లేకపోవడం వలన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. కేంద్రంలో 8వ,రాష్ట్రంలో 12 వ పిఆర్సీ కమిటీలు వేయాల్సి ఉందన్నారు, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలన్నారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలు నిర్ణయించాలన్నారు. మున్సిపల్ శాఖలో 21 వేలు,15 వేలు వేతనం ఇస్తుండగా,మెడికల్ రంగంలో 16 వేలు,10 వేలు ఇస్తున్నారని పార్టైమ్ కంటెంజెంట్స్ గా పనిచేస్తున్న కార్మికులకు 4 వేలు మాత్రమే ఇస్తున్నారని ఇతర శాఖల్లో కూడా వేతన వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. ఈ పద్ధతి సరైనది కాదని అన్ని శాఖల కార్మికులకు ఓకే వేతనం నిర్ణయించాలన్నారు. ఏ శాఖ కార్మికులైనా ప్రతి నెలా 1 వ తేదీ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ,మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్,ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర అధ్యక్ష,కార్యదర్శులు దుర్గాప్రసాద్,కృష్ణానాయక్,హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి వేణుగోపాల్,జిల్లా సహాయ కార్యదర్శి శివకృష్ణ,నాగేంద్ర బాబు,తిరుమలయ్య,మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు నల్లమ్మ, వెంకటేష్,శోభా,భార్గవి,స్కూల్ స్వీపర్స్&వాచ్మెన్ల అధ్యక్ష,కార్యదర్శులు రఫీ,అసేన్ తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు