ఓంశాంతి సేవా కేంద్రం సంచాలకురాలు బి కే.రాధ అక్క
విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి శిక్షణా తరగతులు విజ్ఞాన వికాసాన్ని పెంపొందిస్తాయని ఓం శాంతి సేవా కేంద్రం సంచాలకురాలు బి కే. రాధా అక్క తెలిపారు. ఈ సందర్భంగా వేసవి కాలమును దృష్టిలో ఉంచుకొని పలు మంచి విషయాలను తెలపడానికి వేసవి శిక్షణా తరగతులను పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల ప్రజాపిత బ్రహ్మకుమారి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధా అక్క మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరాలు ఈ నెల రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఆదిలక్ష్మి బాల వికాస్ నిర్వాహకులు పిల్లలకు హైందవ సాంప్రదాయం, శ్లోకాలు గురించి వివరించడం జరిగిందని తెలిపారు. కరుణాకర్ విద్యార్జన కసిగా ఎలా చేయాలి? జీవితములో ఒక రాజుగా ఎలా బతకాలి ?అన్న విషయాలను పిల్లలకు అద్భుతంగా వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి రాధా అక్క మానవునిలోని ఉన్న అద్భుతమైన శక్తిని ఎలా వెలికి తీయాలి అనే విషయాన్ని కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 70 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఆసక్తిగల వారు కూడా ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఇంకను పాల్గొనే అవకాశం కలదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ఇటువంటి వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.
వేసవి శిక్షణా తరగతులు విజ్ఞాన వికాసాన్ని పెంపొందిస్తాయి
RELATED ARTICLES