షిరిడి సాయిబాబా సేవాసమితి అధ్యక్షులు వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం జరిగిందని షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ కార్యదర్శి రామలింగయ్య, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, బంధనాథం సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 135 మంది కంటి పరీక్షల కొరకు రాగా అందులో 50 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. శిబిరానికి వచ్చిన అందరికీ భోజన వసతి కూడా కల్పించడం జరిగిందన్నారు. ఈ శిబిరం ధర్మవరం శ్రీ శిరిడి సాయిబాబా సేవాసమితి, కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఉచిత వసతి తో పాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కంటికి ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని వారు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం పట్ల సాయిబాబా సేవా సమితి వారు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వైద్యులు, సిబ్బంది, బాబా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన..
RELATED ARTICLES