అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే యువర్స్ ఫౌండేషన్ లక్ష్యము అని అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో యువర్స్ ఫౌండేషన్, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూర్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కందికేరి బసమ్మ, కీర్తిశేషులు కందికేరి సోమశేఖర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 98 మంది కంటి పరీక్షలు చేయించుకోగా అందులో 41 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరికి ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచిత వసతి కూడా కల్పించబడునని తెలిపారు. అనంతరం కంటి వైద్యులు కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి దాతలను ఘనంగా సన్మానిస్తూ షీల్డ్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, క్యాంపు చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి, చాంద్ బాషా , జయంతి వినోద్ కుమార్, ఆప్తాలమిక్ అధికారి సికిందర్, రామాంజనేయులు ,నామాల శ్రీనివాసులు, కౌన్సిలర్ కేతా లోకేష్, పే నుజూరు నాగరాజు, రేణిగుంట్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే యువర్స్ ఫౌండేషన్ లక్ష్యం..
RELATED ARTICLES