గురుస్వామి విజయ్ కుమార్, బండ్లపల్లి వెంకట జయప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం ;; పట్టణంలోని కేశవ నగర్ నందు ఈనెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవము విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలకు ప్రజలు భక్తాదులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురు స్వామి పి జే. విజయ్ కుమార్, బండ్లపల్లి వెంకట జయప్రకాష్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి యొక్క మహిమలు విస్తరించాయని, ఇందులో భాగంగా ఆ అయ్యప్ప స్వామి దేవాలయమును దాతలు, భక్తాదులు సహాయ సహకారములతో నిర్మాణం చేపట్టడం మాకెంతో ఆనందదాయకమని తెలిపారు. ఈనెల 10వ తేదీ శనివారం మహాగణపతి పూజ యాజమాన్య సంకల్పం దీపస్థాపన తదితర కార్యక్రమాలు, 11వ తేదీ స్వస్తివాచనం, నవగ్రహ మంటపరాధనం, అగ్ని ప్రతిష్ట హోమాలు కార్యక్రమాలు, సాయంత్రం మూలమూర్తుల గ్రామోత్సవం, 12వ తేదీ సోమవారం మోదక మహాగణపతి హోమం పూర్ణాహుతి విష్ణు సహస్ర నామార్చనలు, 13వ తేదీ మంగళవారం ఆవాహిక దేవత హోమములు గోపుర మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు, 14వ తేదీ బుధవారం యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాధులు తదితర కార్యక్రమాలతో పాటు మహా కుంభాభిషేకం అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట, సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కావున ఈ ఐదు రోజుల కార్యక్రమాలకు వందల సంఖ్యలో ప్రజలు భక్తాదులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.
శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలను విజయవంతం చేయండి..
RELATED ARTICLES