విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మూడవసారి ఏ జిల్లా చలపతి సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సమావేశ కార్యాలయంలో ఎన్నిక జరిగింది. అనంతరం ఏకిల చలపతి మాట్లాడుతూ సభ్యుల సమస్యల కోసం నిరంతరంగా తన పోరాటం కొనసాగిస్తానని వారు వెల్లడించారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా ఏకిల చలపతి, ప్రధాన కార్యదర్శిగా ఏ. నర్సిరెడ్డి, గౌరవ అధ్యక్షులుగా కే. రామయ్య, కోశాధికారిగా పి. సుధాకర్, ఉపాధ్యక్షులుగా నారప్ప, శ్రీరాములు, శివలింగన్న, కొండయ్య, రామచంద్రప్ప, సహాయ కార్యదర్శులుగా శ్రీనివాసులు, వెంకటస్వామి, రామిరెడ్డి, కుల్లాయప్ప, కేశవయ్య తదితరులు ఉన్నారు.
మూడవసారి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకిలా చలపతి ఎంపిక
RELATED ARTICLES