Monday, May 5, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఅక్రమాలకు అండదండగా టౌన్ ప్లానింగ్ విభాగం…

అక్రమాలకు అండదండగా టౌన్ ప్లానింగ్ విభాగం…

బిల్డింగ్ పర్మిషన్ కు లక్షల్లో వసూళ్లు…

విశాలాంధ్ర- నందిగామ:-నందిగామ పట్టణ పరిధిలో పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నందిగామ పట్టణ మున్సిపల్ పరిధిలో జి ప్లస్ త్రీ నిర్మాణాలకు అనుమతులు ఉండగా జి ప్లస్ ఫోర్ ఆ తరువాత నిర్మాణాలు అక్రమ బిల్డింగ్ నిర్మాణాలు చేస్తూ కోట్లు గడిస్తున్న బిల్డర్లకు పట్టణ ప్రణాళిక సంఘం అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి అని ప్రజలు గుసగుసలాడుకోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఒక సాధారణ చిన్న లేదా మధ్యతరగతి వ్యక్తి ఇల్లు నిర్మాణం చేస్తుంటే వారిని సవా లక్ష ప్రశ్నలు తో ఇబ్బందులకు గురిచేసే ప్రణాళిక విభాగం అధికారులు అదే పెద్దలు నిర్మాణం చేస్తుంటే ఎటువంటి షరతులు వర్తించవా వారికి అంటూ ప్రశ్నిస్తున్నారు సాధారణంగా పట్టణ పరిధిలో ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే ముందుగా గృహం నిర్మాణం నిర్మించే సదరు యజమాని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద బిల్డింగ్ అప్రూవల్ పొంది ఉండాలి బిల్డింగ్ అప్రూవల్ అందించాలంటే సదరు నిర్మాణం చేసే ప్లాటు కు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయటం,ఫ్లాట్ కు 30 అడుగుల రోడ్డు ఐ ఉండవలెను ఒకవేళ అలా లేనియెడల ఆ ప్లాట్ నుండి 4 అడుగుల స్థలాన్ని సదరు మున్సిపాలిటీకి భూ యజమాని సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత తన నిర్మాణాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది, అలాగే జి ప్లస్ త్రీ నిర్మాణాలు చేసే ప్రాంతంలో జి ప్లస్ ఫైవ్ నిర్మాణాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోవడం కానీ చేయలేని పరిస్థితుల్లో కాసులకు కక్కుర్తి పడుతున్న సదరు టౌన్ ప్లానింగ్ విభాగం మాత్రం ఆ నిబంధనలను ఎక్కడ నిర్మాణదారుల ను పాటించే విధంగా చర్యలు తీసుకోవడం లేదనేది తేటతెల్లమవుతుంది సి ఆర్ డి ఏ అధికారులు అనేక పర్యాయాలు నందిగామకు వచ్చి నందిగామలో జరుగుతున్న బిల్డింగ్ నిర్మాణాలను పరిశీలించి సదరు నిర్మాణాలను ఆపివేసిన సందర్భాలు కోపలలుగా ఉన్నాయి కానీ యధా రాజా తథాప్రభ అన్న ప్రకారం నందిగామ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్లతో కుమ్మక్కై తమ అక్రమ నిర్మాణాలను తెలియజేస్తున్నారు నందిగామ మున్సిపాలిటీలో జరిగే నిర్మాణాలకు ప్రభుత్వానికి చెల్లించే ఫీజులు అతి తక్కువగా ఉంటే సదరు అధికారుల ద్వారా జరిగే అక్రమ వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో ఉన్నట్లు కొందరు బిల్డర్లే బహిరంగంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యాన్ని వేస్తుంది నందిగామ సీఎం రోడ్ లో గల ఎన్టీఆర్ రోడ్ లో బిల్డర్ యదేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్న అటు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అదే విధంగా నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నివాసానికి వెళ్లే రహదారి ప్రక్కన అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేస్తున్నారంటే వారికి ఏ స్థాయిలో ముడుపులు అందాయో దీన్నిబట్టి అర్థమవుతుందని కొందరు వాపోతున్నారు ప్రణాళిక ప్రకారం ఒక స్థలంలో ఇల్లు నిర్మాణం జరిగితే దానికి మూడు వైపులా రోడ్లు ఉంటే మూడు వైపులా కూడా 30 అడుగుల రోడ్ల నిర్మాణం చేసి ఉంటే మాత్రమే మున్సిపాలిటీకి ఎటువంటి స్థలాన్ని అప్పగించవలసిన అవసరం ఉండదు కానీ స్వయానా శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఇంటి కి వెళ్లే దారిలో 15 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్న సదరు అధికారులు మాత్రం నిర్మాణాలు చేసే వారిని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు అదే కాకుండా పట్టణంలో పలు ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాత్రం కన్నెత్తి చూసే పరిస్థితి లేకపోవడం విచిత్రంగా ఉంది ఇప్పటికైనా సదరు ఉన్నతాధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి పట్టణ ప్రణాళికా విభాగం పనిచేయాలని పలువురు కోరుతున్నారు పలువురు ఫిర్యాదుల మేరకు పట్టణ ప్రణాళిక సంఘం మాత్రం నిర్మాణాలు చేసేటప్పుడు ముడుపులు తీసుకున్న కారణం చేత సదర్ బిల్డర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సరిపత్తగా కేసులు నమోదు చేయడం వారివంతయింది దీనిపై సదరు అది అధికారులను వివరణ కోరగా పట్టణ ప్రణాళిక విభాగ అధికారి చర్వాని ద్వారా అందుబాటులో రాకపోవడంతో పట్టణ మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా ఎవరైతే బిల్డింగ్ పర్మిషన్ కొరకు అధికారులను సంప్రదిస్తారో వారికి నిబంధనలు తెలపడం జరుగుతుందని,ప్రణాళిక ద్వారా ఎవరైతే నిర్మించారో వారికి కన్స్ట్రక్షన్ నోటీసు అందించడం జరుగుతుందని, దాని ఉల్లంఘన జరిగితే ప్రైమరీ నోటీస్ అందించి వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఇప్పటివరకు నందిగామలో 52 అక్రమ నిర్మాణ బిల్డింగ్స్ గుర్తించి నిర్మాణదారులపై 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు