Wednesday, May 7, 2025
Homeజిల్లాలుఅనంతపురంరైతుల నుండి దళారీలు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు.. నియంత్రించండి

రైతుల నుండి దళారీలు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు.. నియంత్రించండి

..ఏపీ రైతు సంఘం
విశాలాంధ్ర -తనకల్లు : క్రాప్ లోన్స్ రెన్యూవల్ ప్రక్రియలో రైతుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటూ రైతుల నడ్డి విడుస్తున్నారని వారిని నియంత్రించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య తో పాటు కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు చౌడప్ప యాదవ్ తదితరులు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టి వల్ల కొన్ని సంవత్సరాలుగా పంటలు పండక పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం అనే జీవితంలో ఓడిపోతున్న రైతులకు అసలు తో పాటు వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలంటే భారమైన పరిస్థితి. ఆ పరిస్థితిని దళారులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక్కొక్క రైతు వద్ద రెన్యువల్ చేయాలంటే మొత్తం వారే చెల్లించి ఒక్క రోజుకు రెండు నుండి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఈ దళారీ వ్యవస్థను నియంత్రించకపోతే రైతుల పూర్తిగా నష్టపోతారన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ డబ్బులు కూడా రైతు చేతి నుండి పడకుండా అసలు పెంచుకొని రెన్యువల్ చేసే ప్రక్రియను కొనసాగించాలన్నారు. బ్యాంకుల వద్ద ఆందోళన చేసిన దళారీల పెత్తనం కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి బ్యాంకులో రైతులకు ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని కోరమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వేమనారాయణ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు చౌడప్ప యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు