Tuesday, May 6, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావిద్యార్థుల కలలను సాకారం చేసిన విప్,ఎమ్మెల్యే సౌమ్య…

విద్యార్థుల కలలను సాకారం చేసిన విప్,ఎమ్మెల్యే సౌమ్య…

సరికొత్త ఆలోచనతో కలలకు రెక్కల కార్యక్రమం…

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే సౌమ్య నిర్ణయం….

పేద విద్యార్థుల ప్రతిభకు విమాన ప్రయాణం…

విద్యార్థులతో కలిసి విమాన ప్రయాణం చేసిన ఎమ్మెల్యే సౌమ్య…

విశాలాంధ్ర -నందిగామ:-పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు బస్సు రైలు ప్రయాణాలు సుపరిచితమే విమాన ప్రయాణం ఒక కల అలాంటి కలను నిజం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు నియోజకవర్గం నుండి అభినందనలు వెలువడుతున్నాయి వివరాల్లోకెళ్తే రెక్కలు తొడిగిన ఆశలు నింగిని తాకే కలలు ప్రతిభకు ప్రేరణ ఆశయానికి గౌరవం వెలసి నింగికి కెగీసిన విమాన ప్రయాణం అంటూ నియోజకవర్గం నుండి గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యధిక మార్కులు పొందిన ఆరుగురు విద్యార్థులను విమాన ప్రయాణానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సిద్ధం చేశారు మంగళవారం ఉదయం ఆరుగురు చిన్నారులతో కలిసి ఆమె గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్ వరకు వారిని విమాన ప్రయాణానికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక సంస్కరణ లో భాగంగా కలలకు రెక్కలు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని అన్నారు దానిలో భాగంగా ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను కొందరిని ఎంచుకొని వారిని ఈరోజు విమాన ప్రయాణం చేయించడం జరుగుతుందని తెలిపారు వారిలో వెంకట నాగ శ్రీ సాయి కంచికచర్ల (587), స్పందన వెంకట నాగ శ్రీ కంచికచర్ల (584),యశస్విని ముప్పాళ్ళ (583),అనూష తోటరావులపాడు (577), గూడూరు గణేష్ రెడ్డి అల్లూరు (573),సిరివేరు నవ్య వెల్లంకి (570) విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించి వారికి జీవితంలో మరింత ఎత్తు ఎదగాలని వారి కలలకు రెక్కలు అందించే కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు మంగళవారం ఆమె తలపెట్టిన ఒక మంచి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంసిం గా మారుతుందని చెప్పారు ఇటువంటి కార్యక్రమం చంద్రబాబు స్ఫూర్తితో చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలో అతి కొద్ది మంది చదువుకునే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు వారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏ విధంగా ఆధునికంగా పరుగులు పెడుతోందో మనం చూసామని,గత ఐదేళ్లు వైసిపి పాలనలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారనీ,ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం క్రమబద్దీకరణ చేస్తూ విద్యార్థుల యూనిఫామ్, పుస్తకాలు,సిలబస్,సబ్జెక్టులు అన్నీ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నా రాష్ట్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ కు ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆమె తెలియజేశారు ఒక విజనరీ లీడర్ ప్రపంచ ప్రఖ్యాత నేతలలో అగ్రగామి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ పనులకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగినది రానున్న రోజుల్లో ఎన్నో కంపెనీలు అమరావతిలో రాబోతున్నాయనీ ఈరోజు నందిగామలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం గా ఉందన్నారు ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో నియోజకవర్గంలోని టాప్ ఫైవ్ విద్యార్థులకు బహుమతిగా ఈరోజు విమాన ప్రయాణం చేయించడం జరుగుతున్నదనీ పేర్కొన్నారు కానుకలు బహుమతులు అంటే వస్తు రూపంలో కాకుండా ఒక అనుభూతిని కలిగించే విధంగా పార్టీ ఆదేశానుసారం విద్యార్థిని విద్యార్థులతో గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు విమానంలో నేను కూడా ప్రయాణం చేయబోతున్నాననీ తెలియజేశారు ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమ నిర్వహణ చేయడం జరుగుతుందనీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద,సామాన్య,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారై ఉంటారు కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకు బస్సులో,రైలులో ప్రయాణం చేస్తారు కానీ విమాన ప్రయాణం ఒక కల అని నేను ఎమ్మెల్యే అవ్వక ముందు ఒక సినిమా చూశాను ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు తన జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కలగంటాడు. ఆ సినిమా చూసినా అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నాననీ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తప్పకుండా ఈ అనుభూతిని అందజేయాలని అనుకున్నాను.ఈరోజు దానిని ఆచరణలో పెట్టడం చాలా సంతోషంగా ఉందనీ పిల్లలకు ఈ అనుభూతి వారి కలలను సహకారం చేసుకోవడానికి మా ఈ ప్రోత్సాహం గా భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు దేశ,విదేశాలలో విమానాలలో ప్రయాణం చేయాలని భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు ఎవరైతే జీవితంలో ఎదగాలని ఆలోచిస్తారో వారికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు మున్ముందు రోజుల్లో కూడా ఉన్నతమైన మార్కులు సాధించిన పిల్లలకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు