Tuesday, May 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుంపర్తి పరమేష్

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుంపర్తి పరమేష్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు తుంపర్తి పరమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు గతంలో టిడిపి పార్టీలో ఉంటూ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ దగ్గర అనుచరుడుగా కొనసాగించేవారు. దీంతో టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కనుముక్కల సానే చెన్నారెడ్డి కుమార్తె రాప్తాడు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సానే ఉమారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పరమేష్ తెలిపారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పురోగతికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, పలువురు పరమేశుకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు