Tuesday, May 6, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లామండలంలో తంబళ్లపల్లి రమాదేవి విస్తృత పర్యటన…

మండలంలో తంబళ్లపల్లి రమాదేవి విస్తృత పర్యటన…

విశాలాంధ్ర నందిగామ:-గ్రామాల్లో పనికిహార పథకం పనిచేసే ప్రజలు తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని జనసేన నందిగామ నియోజకవర్గం కన్వీనర్ తంబళ్లపల్లి రమాదేవి అన్నారు మంగళవారం నందిగామ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో స్థానిక జనసేన నాయకులతో కలిసి ఆమె విస్తృత పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలంలో పనికి ఆహార పథకం పనిచేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు పనికి ఆహార పథకంలో పనిచేసే కార్మికుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఉపాధి హామీ కార్మికుల బాధలు తెలుసు అని దాని ప్రకారమే ఎవరైనా పనికి ఆహార పథకం కార్యక్రమంలో పాల్గొని అకాల మరణం పొందితే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అందించే 75 వేల రూపాయలను ఏకంగా రెండు లక్షల వరకు పెంచడం జరిగిందని ఆమె అన్నారు అంతకుముందు లింగాలపాడు, అడవిరాములపాడు గ్రామాల స్థానిక నాయకులతో కలిసి 300 మజ్జిగ ప్యాకెట్లను కార్మికులకు పంచిపెట్టారు ఉపాధి హామీ పనుల గురించి కార్మికుల కష్ట,సుఖాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం అడవిరావులపాడు గ్రామంలోని నందు భక్త ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆతరువాత లింగాలపాడు గ్రామంలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సందర్శించి హాస్పిటల్ సిబ్బందితో బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురా సత్యనారాయణ,నందిగామ మండల అధ్యక్షులు కుడుపుగంటి రాము, ఎర్రబడి సురేష్,కొట్టె బద్రి,కొమ్మవరపు స్వామి,గ్రామ జనసేన పార్టీ నాయకులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు,వీర మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు