ధర్మవరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం సభ్యులు ఈశ్వరయ్య మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ హాలులో ఈ నెల ఏడవ తేదీ నుంచి 17 రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి ఇంట్యూషన్ ప్రాసెస్ ప్రజ్ఞ యోగ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ధర్మవరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం సభ్యులు ఈశ్వరయ్య, మనోహర్, మణికంఠ, సాయికిరణ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ “ది ఆర్ట్ ఆఫ్ లివింగ్” గురుదేవ్ శ్రీ రవిశంకర్ స్థాపనలో ఏర్పడిన ఈ సంస్థ, 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లల కోసం ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం లో పిల్లల దృష్టి సామర్థ్యాన్ని పెంచేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు అంతఃప్రజ్ఞను అభివృద్ధి చేయడానికి గాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్సాహం ఉన్న ఆటలు, ఆసక్తి కలిగించే ప్రక్రియలు, శ్వాసాభ్యాసాలు, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా రూపొందించబడింది అని తెలిపారు.
ఈ డెమోలో పిల్లలు కళ్లకు గంతలు పెట్టుకొని ఉన్నా, రంగులు, బొమ్మలు, అక్షరాలు గుర్తించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు అని తెలిపారు. గత శిబిరాల్లో ఇది చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు అని తెలిపారు.
గురువు యొక్క శిష్యులు, ప్రియ శిష్యులు అయినటువంటి అనూప్ గురువు ఈ కోర్స్ ని టీచింగ్ చేయడానికి వస్తున్నారు అని తెలిపారు. అంతేకాకుండా
ఇంట్యూషన్ అనేది సరైన సమయంలో సరైన ఆలోచన రావడం, ఈ శిక్షణ పిల్లల్లో స్పష్టత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత ,మంచి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని తెలిపారు.గతంలో పాల్గొన్న తల్లిదండ్రులు, ఈ శిక్షణ వల్ల వారి పిల్లల విద్యా అభ్యాసం, క్రీడా ప్రదర్శన, వ్యక్తిత్వ వికాసం, భావోద్వేగ స్థిరత్వం పరంగా గొప్ప మార్పులు వచ్చాయని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు పిల్లల ఒత్తిడిని తగ్గించడంలో, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.మరిన్ని వివరాలకు ఫోన్: 9042070246, 9642254375 సంప్రదించాలన్నారు.
ఇంట్యూషన్ ప్రాసెస్ ప్రజ్ఞాయోగశిక్షణా కార్యక్రమాలు..
RELATED ARTICLES