Thursday, May 8, 2025
Homeబాంబుల వర్షం

బాంబుల వర్షం

. పాక్‌లో ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడి
. విరుచుకుపడ్డ క్షిపణులు
. 80 మంది ముష్కరుల హతం
. కీలక మౌలిక సదుపాయాల ధ్వంసం
. 25 నిమిషాల్లో పని పూర్తి

యావత్‌ భారత దేశం ఎదురుచూస్తున్న, కోరుకుంటున్న ఘట్టం ఆవిష్కృతమైంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. భారత సైన్యం, వైమానిక దళం, బలగాలు సంయుక్తంగా ఈ మెరుపు దాడి నిర్వహించాయి. పాక్‌ రాడార్లకు చిక్కకుండా క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 ఉగ్ర స్థావరాలను భారత్‌ లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు సైన్యం వెల్లడిరచింది.

న్యూదిల్లీ: యావత్‌ భారత దేశం ఎదురుచూస్తున్న, కోరుకుంటున్న ఘట్టం ఆవిష్కృతమైంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. భారత సైన్యం, వైమానిక దళం, బలగాలు సంయుక్తంగా ఈ మెరుపు దాడి నిర్వహించాయి. పాక్‌ రాడార్లకు చిక్కకుండా క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 ఉగ్ర స్థావరాలను భారత్‌ లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు సైన్యం వెల్లడిరచింది. కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని…పాక్‌ సైనిక శిబిరాలు, పౌర ఆవాసాలు తమ లక్ష్యం కాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విశేషాలను కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ ప్రత్యేకంగా విలేకర్ల సమావేశంలో వెల్లడిరచారు. పాక్‌లోని 4, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 5 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా కోట్లీలోని గుల్పూర్‌ టెర్రర్‌ క్యాంప్‌పై ఎలా దాడి చేశామనేది సోఫియా ఖురేషి వీడియో ప్రదర్శించారు. ఇక్కడే గతంలో ‘పూంచ్‌’ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారంటూ పేర్కొన్నారు. ‘‘అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల వరకు ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించాం. దాదాపు 25 నిమిషాల పాటు సాగింది. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్‌ సిందూర్‌. గుల్పూర్‌ టెర్రర్‌ క్యాంప్‌ అంతర్జాతీయ సరిహద్దుకు 30 కి.మీ. దూరంలోనే ఉంటుంది. లష్కరే తోయిబాకు చెందినదిగా గుర్తించాం. రాజౌరి – ఫూంచ్‌ ప్రాంతాల్లో ఇందులోని ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇక్కడే 2023, 2024లో ఫూంచ్‌ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాదులు ట్రైనింగ్‌ పొందినట్లు మాకు సమాచారం ఉంది’’ అని సోఫియా తెలిపారు.
25 నిమిషాల్లోనే ఉగ్రమూకల ఖేల్‌ ఖతం
భారత భద్రతా బలగాలు పక్కా ప్రణాళికతో కేవలం 25 నిమిషాల్లో 24 క్షిపణులతో దాడులు చేసి ఉగ్రవాద మూకల ఆటకట్టించాయి. చెప్పినట్టే చేసి టెర్రిరిస్టులకే టెర్రర్‌ అంటే ఏంటో చూపించింది. బుధవారం తెల్లవారుజామున 1:05 గంటల నుంచి 1:30 గంటల వరకు 25 నిమిషాల పాటు ఆపరేషన్‌ జరగ్గా, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి 24 క్షిపణులను భారత్‌ ప్రయోగించింది. ఉగ్ర స్థావరాలపై దాడి కోసం భూమి నుంచి, గాలి నుంచి ప్రయోగించే క్షిపణులతో పాటు లేజర్‌ నిర్దేశిత క్షిపణులు, ఉపగ్రహ గైడెడ్‌ గ్లైడ్‌ బాంబులను భారత్‌ ఉపయోగించింది. నిఘా డ్రోన్‌ల రియల్‌ టైమ్‌ పర్యవేక్షణలో అతి తక్కువ ప్రాణనష్టంతో ఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో భారత్‌ ధ్వంసం చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పెద్ద సంఖ్యలోనే పాక్‌ ఉగ్రవాదులు హతమైనప్పటికీ మరణాల వివరాలను తగ్గించి చూపేందుకు పాకిస్థాన్‌ యత్నిస్తోంది.
ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి ముందు భారత త్రివిధ దళాలు పెద్ద కసరత్తే చేశాయి. తొలుత పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాల లొకేషన్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించాయి. ఇందుకోసం భారత నిఘా వర్గాలు అందించిన సమాచారాన్ని వాడుకున్నాయి. పాక్‌, పీఓకేలోని ముజఫరాబాద్‌, కోట్లి, బహవల్‌పూర్‌, రావల్‌ కోట్‌, చాక్‌స్వరి, భీంబేర్‌, నీలం వ్యాలీ, జీలం, చాక్వల్‌లలో ఉన్న నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలను భారత్‌ లక్ష్యంగా ఎంచుకుంది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ గతంలో భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాయి. ఈ రెండు ఉగ్ర సంస్థలకు నిలయాలుగా, స్థావరాలుగా మారిన 9 నిర్దిష్ట ప్రాంతాలనే తమ లక్ష్యంగా భారత త్రివిధ దళాలు ఎంచుకున్నాయి. వీటిలో నాలుగు ఉగ్ర స్థావరాలు పాకిస్థాన్‌లో ఉండగా, మిగతా ఐదు ఉగ్ర స్థావరాలు పీఓకేలో ఉన్నాయి. ఉగ్రవాదులను జమ్మూకశ్మీరులోకి చొరబాటుకు పంపేందుకు ముజఫరాబాద్‌, భీంబేర్‌లను పాక్‌ ఉగ్రవాద సంస్థలు ఎంట్రీ పాయింట్లుగా వాడుకుంటున్నాయి. అందుకే వాటిని ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా టార్గెట్‌ చేశారు. మొత్తం మీద 9 ఉగ్రవాద స్థావరాల్లోని డ్రోన్లతో భారత్‌పై నిఘా పెట్టే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, ట్రైనింగ్‌ క్యాంపులు, ఆయుధ డిపోలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలను భారత సేనలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఇవన్నీ రాత్రికి రాత్రి పాక్‌ ఆక్రమిత కశ్మీరులో ఏర్పాటు కాలేదు. గత 30 ఏళ్లుగా పాక్‌ ప్రభుత్వం, సైన్యం నుంచి అందుతున్న ఆర్థికసాయంతోనే ఉగ్రవాదులు ఈ మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు