Thursday, May 8, 2025
Homeఆంధ్రప్రదేశ్మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరగాల్సిందే : ఎంపీ కేశినేని

మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరగాల్సిందే : ఎంపీ కేశినేని

నాసిరకం మందు పంపిణీ చేసి, వేలకోట్ల రూపాయలు కుంభకోణం జరిగిన మద్యం స్కాంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం లో రూ.3600 కోట్లు కొల్లగొట్టింది వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలంటూ ఆయన గురువారం సీబీఐ చీఫ్ కు లేఖ రాశారు. మద్యం స్కాం నుండి దృష్టి మరల్చడం కోసమే జగన్ పాలేరుగా ఉన్న కేశినేని నాని బురదజల్లే రాజకీయాలకు తెరలేపినట్లు చెప్పారు. తాను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నికార్సైన కార్యకర్తనేనన్నారు.

విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూౌ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, తనకు ఉన్న ఆస్తికి అతను పోరుగునే ఉండడంతో స్థలాన్ని కలసి డెవలప్మెంట్ చేయడం కోసం కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు. జగన్ తో ఉన్న సాహిత్యం, అతనితో ఉన్న ఆర్థిక వ్యాపార లావాదేవీలు, పద్ధతులు నచ్చక తాను స్వచ్ఛందంగా తప్పుకున్నానని డెవలప్మెంట్ తో సహా ఆరు నెలల పాటు అన్ని ఖర్చులు తానే పెట్టుకున్నట్లు చెప్పారు. ఏపీ లిక్కర్ స్కాం కు సంబంధించి లావాదేవీలన్నీ జగన్మోహన్ రెడ్డి నాలుగు కార్యాలయాల్లో జరిగాయని, సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లోనున్న వ్యక్తేనన్నారు. ఆ ప్యాలస్ లోకి రాజ్ కసిరెడ్డితో సహా నలుగురికే ప్రవేశముంటుందన్న ఆయన ఈమధ్య హైదరాబాదులో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికే ఐదుగురు సమావేశమయ్యారని ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు నాని కూడా అందులో ఉన్నారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ తో పాటు, తనపై వచ్చిన ఆరోపణలకు తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని, 24 గంటల్లోగా చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

దేశ ప్రతిష్టను పెంచిన ఆపరేషన్ సింధూర
ముస్కరులను తుద ముట్టించేందుకు భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూరతో దేశ ప్రతిష్ట మరింత పెరిగిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప‌హ‌ల్గామ్ బాధితులు కూడా ఈ ఆపరేషన్ స్వాగతిస్తున్నారన్న ఆయన భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత సైన్యం, ప్రధానమంత్రి మోడీ తీసుకునే ఏ చర్యకైనా దేశమంతా వారి వెంటే ఉంటుందని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు