విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్మించిన నూతన గణపతి దేవాలయం, వాటర్ ట్యాంక్, ఫార్మసీ షెడ్డులను ఆదివారం గుంతకల్ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు చిలకల రాజగోపాల్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధి కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆశీస్సులు చేయూత తోడ్పాటు ఉండటం చేత ఆయన ఆదేశాల మేరకు ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీర్చడం పరికరాలు వైద్య పరికరాలు సమకూర్చుట, శుభ్రత పరిశుభ్రత పట్ల సక్రమంగా నిర్వహించుట, జిల్లాస్థాయిలో మాదిరిగా శస్త్ర చికిత్సలు చేయుట ఇలా అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని ఆయన తెలిపారు.