Saturday, May 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేందుకు.. గోదాం

వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేందుకు.. గోదాం

గొట్లూరులో బహుళ ప్రయోజన గోదామును ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

రైతులకు మౌలిక వసతుల కల్పనపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన బహుళ ప్రయోజన గోదామును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ గోదాము నాబార్డ్‌ సహకారంతో గొట్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఇది గ్రామ స్థాయిలో వ్యవసాయ దిగుబడుల నిల్వ, ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ వృద్ధి వంటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు.రైతులకు మరింత లాభదాయకమైన ధరలు లభించేందుకు ఈ గోదాము ఓ ప్రయోజనకరమైన వేదికగా మారుతుంది అని తెలిపారు. అంతేకాకుండా, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా రైతుల సాధికారతకు, రైతు సంఘాల స్థాయిని పెంచేందుకు అన్ని మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, స్థానిక బీజేపీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, సొసైటీ సీవో, అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, అనంతపురం మాజీ అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు, రూరల్ అధ్యక్షులు సాకే చంద్ర, బిజెపి మహిళా నాయకురాలు కంచం లీలావతి, గొట్లూరు అనిల్, గ్రామ ప్రజలు, రైతులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు