జిల్లా కలెక్టర్ ఏవో కు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : బకాయి ఉన్న ఉపాధి కూలీలకు వెంటనే చెల్లించాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఏవో కు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
బి కె ఎం యూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మన జిల్లాలో జిల్లా వ్యాప్తంగా గత మార్చ్ నుండి ఇప్పటి వరకు రావలిసిన డబ్బుల్లో కేవలం 4 వారాలు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా 6 వారాల మొత్తం రావాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ లో చేసిన పనికి డబ్బులు చెల్లించడంలో చాలా జాప్యం జరుగుతోందన్నారు. డబ్బులు రాకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. దాదాపు జిల్లా లో కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది అన్నారు. వ్యవసాయ కూలీలకు జీవించే హక్కును కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టంను పారదర్శకంగా అమలు పరచాలన్నారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు . ఈ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాజకీయ నాయకుల జ్యోక్యం పూర్తిగా నివారించాల్సిన అవసరము ఉందన్నరు. ఉపాధి హామీ చట్టం మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నారు. డిమాండ్లతో కూడిన అందించడం జరిగిందన్నారు. డిమాండ్లను పరిశీలించి పరిస్కారానికి కృషి చేయాలన్నారు. ఉపాధి కూలీల బాధలను అర్థం చేసుకొని పెండింగ్ డబ్బులు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెరుగు సంగప్ప, జిల్లా నాయకులు మల్ రాయుడు, కుళ్లాయప్ప, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.