రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహా, కోశాధికారి సుదర్శన్ గుప్తా, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, కోశాధికారి మాట్లాడుతూ ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ – శ్రీ సత్యసాయి జిల్లా వారి సహాయ సహకారాలనుతో నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి, అంధత్వాన్ని నివారిస్తూ రెండు జీవితాలలో వెలుగులు నింపాలని తెలిపారు.ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం దాతల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి శిబిర దాతగా కీర్తిశేషులు పిన్ను సూర్యనారాయణ జ్ఞాపకార్థం భార్య వసుంధరమ్మ ,కుమారులు సురేష్ బాబు, సునీల్ కుమార్, కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. కంటి నిపుణులు సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చడం జరిగిందని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు ఆపరేషన్లకు ఎంపికైన వారికి బెంగళూరులో భోజనము వసతి ఇతర సౌకర్యములు కూడా ఉచితంగా కల్పించబడినని తెలిపారు. అదేవిధంగా ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిరంలో 173 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా 138 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందన్నారు. తదుపరి దాతలను, కంటి డాక్టర్ను రోటరీ క్లబ్ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివయ్య, సుశీల, రమేష్ బాబు, కొండయ్య, రామకృష్ణ ,కృష్ణమూర్తి, మనోహర్ గుప్త, ఉట్టి నాగరాజు, రామిరెడ్డి, బత్తలపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..
RELATED ARTICLES