విశాలాంధ్ర ధర్మవరం;; భారత్ అండ్ పాక్ యుద్ధంలో మన భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మన కోసం మన దేశం కోసం వీర మరణం పొందిన మన దేశ సైనికుడు గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థలైన ఆదర్శ పార్క్, ఆదర్శ సేవా సంఘం తో కలిపి అన్ని స్వచ్ఛంద సంస్థలు ఉదయం శాంతియుత ర్యాలీని పట్టణంలో చేపట్టారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కళా జ్యోతి సర్కిల్ పాండురంగస్వామి ఆలయ సర్కిల్ గాంధీనగర్ ఎన్టీఆర్ సర్కిల్ అంజుమన్ సర్కిల్ మీదుగా కాలేజీ సర్కిల్ వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ శాంతియుత ర్యాలీలో ధర్మవరం బ్రహ్మకుమారి వారు కూడా పాల్గొని వీర జవాన్ కు నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ కమిటీ వారు పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేస్తూ జైహింద్, జై భారత్ మాతాకీ జై అన్న నినాదాలు మారుమోగాయి. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ వీర జవాన్ మురళి నాయక్ మన అందరి హృదయాలలో గూడుకట్టుకున్నాడని, దేశ రక్షణ కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు అని తెలిపారు. ప్రతి వ్యక్తి దేశం నాకేమీ ఇచ్చింది అని అనకుండా, దేశానికి నేను ఏమి చేశాను అన్న ధోరణిలో ఉండాలని తెలిపారు. పాకిస్తాన్ దుశ్చర్య ఘటనలకు భారతదేశ సైనికులు కూడా గట్టిగా బుద్ధి చెబుతారని తెలిపారు. వీర జవాన్ మురళి నాయక్ గోరంట్ల మండలం తల్లి తండాకు చెందిన వ్యక్తి అని, ఇతని తల్లిదండ్రులకు ఒక్కగాన ఒక కుమారుడు దేశం కోసం మృతి చెందడం ఒకరకంగా బాధాకరమైన, మురళి నాయక్ చేసిన ప్రాణత్యాగం దేశ ప్రజలను కాపాడడం జరిగిందన్నారు. వీర జవాన్ మృతి పట్ల కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. భారతీయులందరూ చిన్న వయసు నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, అప్పుడే మనం భారతదేశాన్ని రక్షించుకోగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు, ప్రజలు, మాజీ ఆర్మీ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
అమర వీరుడు మురళి నాయక్ కు ఘన నివాళులు అర్పించిన స్వచ్ఛంద సేవా సంస్థలు
RELATED ARTICLES