– యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర ప్రభుత్వం 12వ పి ఆర్ సి కమిటీ చైర్మన్ ని నియమించి, వెంటనే పిఆర్సి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శిలు శెట్టిపి జయ చంద్రారెడ్డి ,కే .మనోహర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలోకొన్ని విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఒకవేళ కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు 30 శాతము, మద్యంతర భృతి ప్రకటించాలని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న డి. ఏ . లను విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు.మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004 కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, డిమాండ్ చేశారు..
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి అమలు చాలా ఆలస్యమైందని 2023 జూలై 1 నుండి అమలు కావలసిన పిఆర్సి ఇప్పటివరకు అమలు కాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పిఆర్సి కమిటీ చైర్మన్ ని నియమించి పిఆర్సి ప్రకటించాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిలు శెట్టిపి జయచంద్రారెడ్డి, కే మనోహర్ , ధర్మవరం యుటిఎఫ్ నాయకులు లక్ష్మయ్య , అమర్ నారాయణరెడ్డి , బిల్లే రామాంజనేయులు, సకల చంద్రశేఖర్ పెద్దకోట్ల సురేష్ , కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.
పి ఆర్ సి కమిటీ చైర్మన్ ని నియమించి వెంటనే పిఆర్సి ప్రకటించాలి
RELATED ARTICLES