Monday, May 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅమితమైన అంతులేని అనురాగం అమ్మ..

అమితమైన అంతులేని అనురాగం అమ్మ..

స్పందన ఆసుపత్రి డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; అమితమైన అంతులేని అనురాగం అమ్మ అని స్పందన ఆసుపత్రి డాక్టర్ సోనియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలు పెరుగని ఓర్పు అమ్మ అని, అద్భుతమైన స్నేహం అమ్మ అని, అపురూపమైన కావ్యం అమ్మ అని తెలిపారు. ఈ లోకంలో ఎవరు ద్వేషించిన నిన్ను ప్రేమించే వ్యక్తి కేవలం ఒక అమ్మ మాత్రమే నని తెలిపారు. ప్రతి తల్లి తన ప్రాణం ఉన్నంతవరకు బిడ్డ కోసమే తపిస్తుందని తెలిపారు. కృతజ్ఞతతో తీర్చుకోలేని రుణము అమ్మ అని, అంతేకాకుండా ఈ లోకములో అన్నిటికన్నా అమూల్యమైనది, అతి మధురమైనది, అనంతమైనది అమ్మ ప్రేమ అని వారు స్పష్టం చేశారు. ఈరోజు మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన, ప్రేమ భరితమైన వ్యక్తి అయిన తల్లిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. మాతృ దినోత్సవం అనేది మనకు జీవితం అందించిన తల్లి ప్రేమకు, త్యాగానికి, నిస్వార్థ సేవకు, గుర్తుగా జరుపుకునే రోజు అని, మన చిన్ననాటి నుండి ఈరోజు వరకు ప్రతి అడుగులో ప్రతి కష్టములో ప్రతి విజయములో తల్లి తోడుగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి వ్యక్తి కష్టములో విజయములో తల్లి తోడుగా నిలుస్తుందని, తల్లి హృదయములో అపారమైన ప్రేమ ఉంటుందని తెలిపారు. కాబట్టే మనం అందరం తల్లి ప్రేమను మరవరాదు, తల్లిని కించపరిచి మాట్లాడరాదని తెలిపారు. వారి జీవించినంత కాలం ప్రేమతో వారిని చూడాలని తెలిపారు. ప్రతి తల్లి తన బిడ్డల సుఖశాంతులను మాత్రమే కోరుతుందని, కష్టాలను కోరదు అని వారు స్పష్టం చేశారు. ప్రాణికి మూల కారణం ఆ దేవుడే అయినా ప్రాణాధారం మాత్రం మాతృ గర్భమే అవుతుందని, తల్లి, దైవం వేరువేరు కాదు అని తెలిపారు. ప్రతి తల్లి తన ముద్దుబిడ్డల వైపే మొగ్గు చూపుతోందని, మరే ఇతర ఆలోచన ఉండదని తెలిపారు. అమ్మ విషయములో మనిషి దేవుడి కన్నా అదృష్టవంతుడే అని తెలిపారు. అనురాగం అంగడి సరుకు కాదు అని, అమ్మది బేషరతు ప్రేమ అని వారు తెలిపారు. అమ్మ ప్రేమకు, అమ్మ ఆలాపనకు ఎవరు వెలకట్టలేరని తెలిపారు. కావున కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అమ్మతో ఆప్యాయంగా, గౌరవంగా ఉంటూ కుటుంబాన్ని సుఖ జీవితముగా మార్చుకోవచ్చునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు