విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం పురపాలక సంఘ కార్యాలయమునకు నూతన రెవెన్యూ ఆఫీసర్ గా బి. ఆరిఫ్ పదవీ బాధ్యతలను చేపట్టారు. వీరు కర్నూలు జిల్లా డోన్ లో రెండు దఫాలుగా 8 సంవత్సరాలు మున్సిపల్ మేనేజర్ గా విధులు కొనసాగించారు. అనంతరం పదోన్నతపై ధర్మవరం మున్సిపల్ కార్యాలయమునకు రెవెన్యూ ఆఫీసర్గా బదిలీగా వచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలను చేపట్టారు. తదుపరి ఆరిఫ్ మాట్లాడుతూ ధర్మవరం మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. తదుపరి మున్సిపల్ అధికారులు, సిబ్బంది నూతన రెవెన్యూ ఆఫీసర్ కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశా రు.
నూతన మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ గా ఆరిఫ్
RELATED ARTICLES