శ్రీ సత్య సాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం;; బుద్ధుని బోధనలు నేటి మానవాళికి ఆదర్శము అని శ్రీ సత్యసాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధించిన ప్రేమ, శాంతి ,ధ్యాన మార్గాలలో నేడు మానవులు అనుసరించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల కూడా ఎంతో ఉపయోగం ఉందని కూడా తెలిపారు. ధ్యానం అవలంబించడం వలన మానసిక ప్రశాంతి తో పాటు నిగ్రహ శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి అధ్యాపకులు వనిత, సీనియర్ అసిస్టెంట్ మునుస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బుద్ధుని బోధనలు నేటి మానవాళికి ఆదర్శం..
RELATED ARTICLES