దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు.. గురుస్వామి విజయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కేశవ నగర్లో నూతనంగా నిర్మాణం అయిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 10వ తేదీన నుండి 14వ తేదీ వరకు ఘనంగా దాతలు, అయ్యప్ప భక్తాదులు, పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వాహకులు గురుస్వామి విజయ్ కుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండ్లపల్లి వెంకట జయప్రకాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు శనివారం మహాగణపతి పూజ, యాగ సంకల్పం, రక్షాబంధనం, వాస్తు హోమం,సూత్ర వేస్టణం ,అఖండ దీపా స్థాపన అంకురార్పణముతో ప్రారంభం కావడం జరిగింది. తదుపరి మూడవరోజు మహాగణపతి, ఏకాదశ రుద్ర, నవమాన అవాహిత దేవత హోమాలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ గురు స్వామి విజయకుమార్,అర్చకులు వారి శిష్య బృందం నిర్వహించారు. తదుపరి శివ సహస్రనామ, విష్ణు సహస్రనామ, పుష్పాదివాసము పూర్ణాహుతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి భక్తాదులు అయ్యప్ప స్వామి ఆలపించిన వైనం అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమాలను తిలకించడానికి వందలాదిమంది అయ్యప్ప మాల ధారణ భక్తాదులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయ వేడుకలు..
RELATED ARTICLES