Homeఅంతర్జాతీయంచిలీ`చైనా దౌత్య బంధానికి 55ఏళ్లు

చిలీ`చైనా దౌత్య బంధానికి 55ఏళ్లు

- Advertisement -

ద్వైపాక్షిక సమన్వయంతో ప్రయోజనాలు: జిన్‌పింగ్‌, బోరిక్‌

బీజింగ్‌: చైనా, చిలీ దౌత్య బంధానికి ఈ ఏడాదితో 55 ఏళ్లు పూర్తి అవుతాయి. తమ దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యా న్ని మరింతగా పెంపొందించుకోవాలని చైనా, చిలీ అధ్యక్షులు జిన్‌పింగ్‌, గేబ్రియల్‌ బోరిక్‌ నిర్ణయించారు. చైనా, లాటిన్‌ అమెరికా దేశాల ఉమ్మడి అభివృద్ధి నమూనా ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించారు. చైనాసెలాక్‌ సదస్సు నేపథ్యంలో గేబ్రియల్‌ బోరిక్‌తో రాజధాని బీజింగ్‌లో జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాదేశిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రాజకీయంగా పరస్పరం నమ్మకాన్ని పెంచుకోవాలని, పాలనా అనుభవాలు పంచుకోవాలని, చిలీతో కలిసి పనిచేయాలని చైనా భావిస్తున్నట్లు జిన్‌పింగ్‌ తెలిపారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌తో పాటు వ్యవసాయం, పశు సంవర్థక, మత్స్య, అటవీ, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతులు, హరిత ఖనిజాలు, ఖగోళం, ఉత్తరదక్షిణ ధ్రువాలు, కృత్రిమ మేథ, బయో మెడిసిన్‌, డిజిటల్‌ ఎకానమీ సంబంధిత రంగాల్లో మరింతగా సహకరించుకుందామని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. స్వేచ్ఛా వాణిజ్యం, బహుపాక్షికవాదానికి చైనా, చిలీ అనుకూలమని, గ్లోబల్‌ సౌత్‌కు సంబంధించి ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు సిద్ధమని ఇద్దరు అధ్యక్షులు తెలిపారు. చిలీకి అత్యంత కీలక వాణిజ్య భాగస్వామిగా చైనా ఉందని, ద్వైపాక్షిక సమన్వయంతో రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం కలుగుతున్నదని గేబ్రియల్‌ బోరిక్‌ అన్నారు. ‘వన్‌ చైనా’ సిద్ధాంతానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. చైనాతో వాణిజ్యం, పెట్టుబడులు, ఏఐ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతపర్చుకునేందుకు చిలీ సిద్ధమన్నారు. ఇదిలాఉంటే, రెండు దేశాల మధ్య ఎకానమీ, పబ్లిషింగ్‌, ఇన్‌స్పెక్షన్‌, క్వారంటైన్‌, మీడియా రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. సంబంధిత పత్రాలపై సంతకాలు జరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు