విశాలాంధ్ర- వలేటివారిపాలెం : 50శాతం రాయితీపైన పచ్చ రొట్టె విత్తనాలు అయిన జనుము, జీలుగా మరియు పిల్లి పెసర విత్తనాలు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రం నందు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీలుగా ధర ఒక క్వింటా పూర్తి ధర:12300రూపాయలు
సబ్సిడీ:6150 పోను
రైతు చెల్లించవలసినది:6150రూపాయలు చెల్లించాలని అన్నారు. అదేవిధంగా జనములు ధర క్వింటాలలో
పూర్తి ధర:10,900 రూపాయలు
సబ్సిడీ:5450రూపాయలు
రైతు చెల్లించవలసినది:5450రూపాయలు,పిల్లి పెసర ధర క్వింటా
పూర్తి ధర:18,000రూపాయలు
సబ్సిడీ: 9,000రూపాయలు,
రైతు చెల్లించవలసినది:9,000రూపాయలు అని తెలిపారు.కావలసిన
రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డ్, దరఖాస్తు పత్రం మరియు మొబైల్ ఫోన్ తీసుకొని సంబంధిత రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకులను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకొని నగదు చెల్లించాలని తెలియజేశారు. విత్తనాల కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకొని నగదు చెల్లించిన రైతులకు పది రోజుల్లో రైతు సేవా కేంద్రం నకు విత్తనాలు తెప్పించబడునని తెలిపారు.