Monday, May 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జి. సంతోష్ కుమార్

ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జి. సంతోష్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైనట్లు జి. సంతోష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్ ) 17వ జాతీయ మహాసభలు తిరుపతి లో సుఖ్జిందర్ మహేసరి ప్రధాన కార్యదర్శిగా, రౌషన్ కుమార్ సిన్హా అధ్యక్షుడిగా , 45 మంది కార్యవర్గ సభ్యులు, 107 మంది కౌన్సిల్ సభ్యులు నూతన నాయకత్వాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శ ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన పేర్కొన్నారు.మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి లో జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఆరుగురు నేతలను జాతీయ కౌన్సిల్ లోకి ఎంపిక చేయడం జరిగిందన్నారు. 17వ జాతీయ మహాసభలలో అనేక యువజన, విద్యార్థి, మహిళా,కార్మిక, కర్షక సమస్యలపై చర్చలు జరిగాయని, పాలకులు అవలంబిస్తున్న విధానాలపై నిర్దిష్టమైన చర్చలు జరిపి, తీర్మానాలు రూపంలో భవిష్యత్ పోరాటాలను ఈ మహాసభ కార్యాచరణ ద్వారా రూపొందించిందన్నారు. అదే విధంగా నేడు దేశంలో కేంద్ర ప్రభుత్వం యువతను మతం పేరుతో విభజిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్న పాలకులపై సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ద్వారా మాత్రమే నిరుద్యోగం తగ్గుతుందన్నారు. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి నిరుద్యోగ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వెంటనే వెంటనే నిరుద్యోగ భృతి 3 వేలు ఎటు వంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు