Tuesday, May 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమినీ మహానాడు పండుగకు తరలిరండి

మినీ మహానాడు పండుగకు తరలిరండి

కార్యకర్తల కష్టంతోనే తెదేపాకు అధికారం

పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం

సూపర్ సిక్స్ పథకాలు అమలుతో అన్ని వర్గాలకు చేరువ కాబోతున్నాం

చంద్రబాబు నాయకత్వంలో కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించాం
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గ మినీ మహానాడు పండుగకు ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి మినీ మహానాడు పండుగను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ,ప్రతి ఏడాది జరిగే మినీ మహానాడు పండుగను ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో అట్టహాసంగా విజయవంతంగా జరుపుకుందామని తెదేపా నాయకులు నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈనెల 23వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ధర్మవరం పట్టణం గాంధీనగర్ లో గల శ్రీ మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుందని తెలిపా రు,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తో పాటు,హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కెపార్థసారధి ,నియోజకవర్గ అబ్జర్వర్ నాగేంద్ర కుమార్ హాజరవుతున్నారని తెలిపారు.కావున ఈ కార్యక్రమమును విజయవంతం చేయుటకు నియోజకవర్గంలో గల తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరుకావాలని తెలుగుదేశంపార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు