Friday, May 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనారోగ్యం తాళలేక మహిళ చెరువులో పడి మృతి

అనారోగ్యం తాళలేక మహిళ చెరువులో పడి మృతి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని శివానగర్కు చెందిన లలిత (56 సంవత్సరాలు) అనారోగ్యంతోలలేక తీవ్ర మనస్థాపానికి గురై పట్టణంలోని రెండవ మరుగు వద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతురాలు గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండేదని, షుగర్ వ్యాధి వలన కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో చిటికెన వేలు కూడా తొలగించడం జరిగిందన్నారు. ఆ బాధ భరించలేక మనస్థాపనతో చెరువులో దూకి చనిపోవడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుదారుడైన విష్ణు సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు