యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ శ్రీ సత్య సాయి జిల్లా
విశాలాంధ్ర ధర్మవరం: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత సహకార కేంద్రం ఏర్పాటు చేసినట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ప్రభుత్వం మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని తీసుకుని వచ్చి బదిలీలు జరుపుతున్నదని, బదిలీలకు సంబంధించిన ఏవైనా సమస్యల పరిష్కారానికి , ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు, బదిలీల ప్రక్రియలో తలెత్తే సమస్యలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.బదిలీలకు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఇబ్బందులకు గురికాకుండా వారికి మార్గదర్శకత్వం అందించే విధంగా బదిలీల ప్రక్రియ ముగిసే వరకు పి ఆర్ టి వీధిలోని యుటిఎఫ్ భవన్లో సహకార కేంద్రాన్ని నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ధర్మవరం డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులతో పాటు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బదిలీలలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించగలరని తెలిపారు. ఈ సేవలు అన్ని పూర్తిగా ఉచితంగా అందించబడతాయని వారు తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, లతాదేవి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి, ధర్మవరం డివిజన్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్ నారాయణ రెడ్డి, జింక హరికృష్ణ, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్ , బిల్లే రామాంజనేయులు, రామాంజనేయులు, వెంకట కిషోర్, ఆంజనేయులు, కుళ్ళాయప్ప, ఆదిశేషు, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీల ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు
RELATED ARTICLES