Saturday, May 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు సేవ చేయడంలోనే సంతృప్తి, సంతోషం

రోగులకు సేవ చేయడంలోనే సంతృప్తి, సంతోషం

శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడంలోనే సంతృప్తి, సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 380 మంది రోగులకు, సహాయకులకు వైద్యులు, నర్సుల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా గర్భవతులకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారూ. ఈ సందర్భంగా కన్వీనర్ నామ ప్రసాద్ మాట్లాడుతూ నేటి ఈ సేవ కార్యక్రమానికి సేవాదాతగా ఉరుకుండ్ల రంగనాథం వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారములతో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహాయ సహకారము లేనిదే ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేమని, ధర్మవరంలో దాతలకు కొదువు లేదన్న సిద్ధాంతంతో తాము ముందుకు వెళుతున్నాను మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. పుట్టపర్తి భగవాన్ సాయిబాబా వారి ఆశీస్సులతో పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని కలిగి ఉంటూ, మానవతా విలువలను పెంపొందించేలా తమ జీవితాన్ని మలుచుకోవాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రి తరపున సత్యసాయి సేవా సమితి వరకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు