Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మేం ఇంట్లో కూడా మాస్క్‌లు ధరిస్తున్నాం

దిల్లీ వాయు కాలుష్యంపై చీఫ్‌ జస్టిస్‌

దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైందని, ప్రజలు ఇళ్లలో కూడా మాస్క్‌లు ధరించాల్సి వస్తోందని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని దిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూస్తున్నారు కదా, మేం మా ఇండ్లల్లో కూడా మాస్క్‌లు ధరిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. క్షీణిస్తున్న వాయు నాణ్యతతో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు పేర్కొన్నారు. .సీజే ఎన్వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పిటిషన్‌ విచారణ చేపట్టింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఢల్లీి, హర్యానా, పంజాబ్‌, పశ్చిమ యూపీలో రైతులు పంటల్ని కాలుస్తున్న ఘటనలను అదుపు చేసేందుకు ఢల్లీి, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. రైతులకు హ్యాపీ సీడర్‌ మెషీన్లను అందుబాటు ఉంచాలని సూచించింది. రెండు లక్షల సీడర్‌ మెషీన్లు 80 శాతం సబ్సిడీ రేటుకు అందుబాటులో ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. తాను రైతునే అని, సీజేఐ కుటుంబం కూడా రైతు ఫ్యామిలీ అని, ఆ మెషీన్ల కచ్చితమైన ధర ఎంతో చెబుతారా అని సూర్య కాంత్‌ ప్రశ్నించారు. దానికి బదులిస్తూ.. సహకార సంఘాలు ఆ మెషీన్లను ఉచితంగా ఇస్తున్నట్లు తుషార్‌ మెహతా చెప్పారు.ఏక్యూఐని 500 నుంచి 200కు ఎలా తగ్గిస్తాం, ఏవైనా అత్యవసర నిర్ణయాలు తీసుకోండి, రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తారా.. ఇంకేదైనా ప్లాన్‌ ఉందా.. ప్రజల ఎలా బ్రతుకుతారని సీజే రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు. మరో రెండు మూడు రోజుల్లో ఢల్లీిలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని, ఈ లోగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని, దీర్ఘకాలిక పరిష్కారం గురించి తర్వాత ఆలోచిద్దామని కోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img