హెడ్మాస్టర్ ఉమాపతి
విశాలాంధ్ర ధర్మవరం;; తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శాంతినగర్ మున్సిపల్ హైస్కూల్లో ప్రార్థన సమయంలో నూతనంగా చేరిన వారు విద్యార్థులకు పరిచయం చేస్తూ విద్య యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతినగర్లో నివాసముంటున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇదే పాఠశాలలో కొనసాగించేలా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి తల్లికి వందనంతో పాటు వివిధ ప్రభుత్వం చేత తీసుకొనబడేటువంటి సహకారాలు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేకూరుతాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని వారు కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించండి..
- Advertisement -
RELATED ARTICLES


