Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగ విజయవంతం పట్ల కృతజ్ఞతలు.. యోగా మాస్టర్స్

యోగ విజయవంతం పట్ల కృతజ్ఞతలు.. యోగా మాస్టర్స్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన యోగ కార్యక్రమ వేడుకలు అత్యంత వైభవంగా విజయవంతం కావడం పట్ల శ్రీ సత్యసాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, యోగా మాస్టర్స్ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా తెలపడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపారు. యోగా వలన శరీర దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యం లభిస్తుందని తెలపడానికి జరిగిన యోగా డేనే ఆదర్శమని తెలిపారు. ఈనెల 21వ తేదీ ప్రపంచ యోగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, డిఆర్డిఏ అధికారి, ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో సాయి మనోహర్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ, పట్టణ పుర ప్రముఖులు అవగాహన సదస్సుకు హాజరై ఎంతో విజయవంతం చేయడం గర్వించదగ్గ విషయం అని తెలుపుతూ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు