Wednesday, June 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రికెట్ కిట్ అందజేత.. సందారాఘవ

క్రికెట్ కిట్ అందజేత.. సందారాఘవ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ చేనేత ప్రముఖులు, ప్రముఖ వ్యాపారస్తులు, టిడిపి నాయకులు సందా రాఘవ, సందా రవి చేతుల మీదుగా పట్టణములోని వెంకటరమణ కుమార్తె రేఖరానికి క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా సందా రాఘవ మాట్లాడుతూ జాతీయస్థాయి క్రికెట్ టోనీలో రాణించి ధర్మవరానికి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని వారు తెలిపారు. రేఖా రాణి ప్రస్తుతం జీవన్ జ్యోతి పాఠశాలలో చదువుతోందని ఈ విద్యార్థిని క్రికెట్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. క్రికెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో చేనేత ప్రముఖులు ఆ విద్యార్థినికి క్రికెట్ కిట్టును బహూకరించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు