Friday, May 3, 2024
Friday, May 3, 2024

శరణార్థుల సమస్యపై పోలాండ్‌ ప్రభుత్వం విఫలం: కేకేపీ

పోలాండ్‌: శరణార్థుల సమస్యలపై పోలాండ్‌ ప్రభుత్వ విధానాన్ని పోలాండ్‌ కమ్యూనిస్టులు తీవ్రంగా ఖండిరచారు. పోలాండ్‌ ప్రభుత్వ విధానం విఫలమైందన్నారు. పోలాండ్‌`బెలారస్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న శరణార్థుల సంక్షోభానికి సంబంధించి మాట్లాడుతూ శరణార్థుల సమస్యతో కనీసం ఒక డజను మంది మరణానికి దారితీసిందని పోలాండ్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేపీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించలేని ప్రభుత్వం రాజీనామా చేయాలని కేకేపీ డిమాండ్‌ చేసింది. నాటో సభ్యదేశాలైన పోలాండ్‌, ముఖ్యంగా ఇరాన్‌, అఫ్టానిస్తాన్‌లలో యుద్ధం కారణంగా ప్రభావితమైన పరిస్థితుల్లో కీలకపాత్ర పోషించిందని పోలాండ్‌ ద్వారా యూరోపియన్‌ దేశాల శరణార్థులు పశ్చిమ దేశాలకు చేరుకోవాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలు, స్వదేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజలు వలస వెళ్లడాన్ని కేకేపీ తీవ్రగా గర్హించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img