పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి…ఏఐటీయూసీ
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ కు సూపర్డెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ ఆత్మరామ్ ని శనివారం ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఫ్లవర్ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి వి కృష్ణుడు,నగర అధ్యక్షులు చి చిరంజీవి, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ… పెండింగ్ లొ ఉన్న మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని, జీతాలు సక్రమంగా రాక పుటా గడవడానికి రోజు గడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు .వేతనాలు పెండింగ్ లేకుండా చూడాలని, కార్మికులపై పని ఒత్తిడి పెట్టకుండా పని బారం పెట్టకుండా, పెండింగ్ లో ఉన్న ఈ ఎస్ ఐ , ఈపిఎఫ్ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికుల శ్రేయస్ కోసం పాటుపడాలని కార్మికులకు బట్టలు,గ్లౌజ్,మాస్కులు అందరికీ బూట్లు తక్షణమే ఇవ్వాలని సూపర్డెంట్ ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ యూనియన్ నాయకులు భార్గవి,పద్మ,గీతా భాయ్,శోభ తదితరులు పాల్గొనడం జరిగింది.